
హైదరాబాద్ కూకట్ పల్లిలో మరో మహిళతో భర్త రాసలీలు సాగిస్తుండగా భార్యకు అడ్డంగా దొరికిపోయాడు . భర్త కామక్రీడల్లో మునిగితేలుతుండగా బంధువులతో వచ్చిన భార్య రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగి శివకి నాలుగేళ్ల క్రితం దీప్తితో వివాహం అయ్యింది. వీళ్లకు మూడేళ్ల పాప ఉంది. గత కొంతకాలంగా దీప్తిని దూరంగా పెడుతున్నాడు శివ. అనుమానం వచ్చిన భార్య దీప్తి..తన భర్త కూకట్ పల్లిలోని విజయ లక్ష్మి అపార్ట్మెంట్ లో సుష్మా అనే మరో మహిళతో సహజీవనం చేస్తున్నట్లు తెలుసుకుంది. దీంతో ఏప్రిల్ 26న దీప్తి తన బంధువులతో కలిసి వెళ్లి భర్త మరో మహిళతో కలిసి ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది.
ఈ మధ్య వివాహేతర సంబంధాలు, డేటింగ్ ఘటనలు రోజురోజుకు ఎక్కవవుతున్నాయి. పచ్చని కాపురాల్లో మంటపెడుతున్నాయి. సంసారాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి. వివాహబంధాలకు విలువ లేకుండా చేస్తున్నాయి.