ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య .. 3 నెలల తర్వాత లొంగిపోయిన నిందితుడు

హైదరాబాద్ ఎల్లారెడ్డిగూడలో దారుణం జరిగింది. ప్రియుడి మోజులో  కట్టుకున్న భార్తను సుఫారీ ఇచ్చి హత్యచేయించింది  ఓ భార్య.  గుండెపోటుతో మరణించాడని ఎవ్వరికీ అనుమానం రాకుండా  దహనసంస్కారాలు కూడా చేసింది.ఈ ఘటన జరిగిన మూడు నెలల తర్వాత నిందితుడు లొంగిపోవడంతో అసలు విషయం బయటపడింది. 

 మధురానగర్ పోలీసులు వెల్లడించిన  వివరాల ప్రకారం.. ఎహైదరాబాద్ లోని ఎల్లారెడ్డి గూడలో   జయప్రకాశనగర్ లోని శిఖర అపార్డ్ మెంట్ లో  నివాసం ఉండే సీసీ కెమెరా టెక్నీషియన్ విజయ్ కుమార్(40)కు భార్య శ్రీలక్ష్మి (33), ఇద్దరు మగ పిల్లలు (9, 8 ఏండ్లు) ఉన్నారు. కొంత కాలంగా బోరబండకు చెందిన రాజేశ్ (30)తో శ్రీలక్ష్మి వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. వీళ్ల బంధానికి తన భర్త అడ్డుగా ఉన్నాడని   భావించిన శ్రీలక్ష్మి  ప్రియుడితో కలిసి మర్డర్ కు ప్లాన్ చేసింది.  భర్త పేరు మీద మేడ్చల్, ఎల్లారెడ్డిగూడలో సొంత ఇండ్లు ఉన్నాయి. భర్తను హత్య  చేయించి ఎంజాయ్ చేద్దాం అనుకుంది.  ఎల్లారెడ్డిగూడలో ఉంటున్న ఇల్లు వాస్తు బాగో లేదని చెప్పి శిఖర అపార్టమెంట్ కు  మకాం మార్పించి మర్డర్ కు ప్లాన్ చేసింది.   

వీరామారావునగర్ కు  చెందిన పటోళ్ల రాజేశ్వర్రెడ్డి,  ఎండీ మెహ్రాబ్ అలియాస్ బబ్బన్ ను రాజేశ్ సంప్రదించి సుపారీ ఇచ్చాడు.  ఫిబ్రవరి 1న ఉదయం పిల్లలిద్దర్ని స్కూల్లో దిగబెట్టేందుకు భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లగానే, రాజేశ్వర్రెడ్డి, బబ్బన్ ను  శ్రీలక్ష్మి ఇంటికి పిలిపించి బాత్రూంలో దాచిపెట్టింది. భర్త ఇంటికి రాగానే తలుపులు మూసేసి బాత్రూం డోర్  తీయటంతో బయటకు వచ్చారు. విజయకుమార్ తలపై డంబెల్స్ తో  కొట్టి గొంతు నులిమి చంపి బాత్రూంలో పడేసి వెళ్లిపోయారు. బాత్రూంకి వెళ్లిన భర్తకు గుండెపోటు వచ్చి, గోడ తలకు తగిలి చనిపోయాడని నమ్మించింది భార్య. బంధువులను పిలిపించి శ్రీనగర్ కాలనీలోని శ్మశాన వాటికలో అదే రోజు దహన సంస్కారాలు పూర్తి చేసింది. మృతుడి కుటుంబంలో చనిపోయినవారిని పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేయకుండా  విజయ్ మృతదేహాన్ని  దహన సంస్కరాలు చేసింది. దీన్ని  బట్టి పథకంలో భాగంగానే శ్రీలక్ష్మి మర్డర్ కు సంబంధించిన ఆధారాలు చిక్కకుండా చేసినట్లు తెలుస్తోంది.

విజయ్ గుండెపోటు మరణం కాదని తామే హత్య చేశామని  హత్య చేసినప్పటి నుంచి తనకు మన శాంతి లేకుండా పోయిందని. అందుకే నేరాన్ని అంగీకరిస్తున్నానని రాజేశ్వర్రెడ్డి  మే 14న   రాత్రి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అతడు ఇచ్చిన సమాచారంతో శ్రీలక్ష్మి, రాజేశ్, బబ్బన్ ను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. హత్య కేసుతో పాటు సాక్ష్యాలు లేకుండా చేసినందుకు సెక్షన్లు 302, 201 కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.