కూసుమంచి, వెలుగు: తరుముతున్న కుక్కల నుంచి తప్పించుకోబోయి ఓ అడవి జింక వ్యవసాయ బావిలో పడిపోయింది. తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలుకు చెందిన గోకినపల్లి కృష్ణ అనే రైతు పొలం వద్ద ఉన్న కాపలా కుక్కలు గురువారం అటుగా వచ్చిన అడవి జింకను గమనించాయి.
ఒక్కసారిగా జింకపైకి ఉరకడంతో వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో తాతా బుజ్జయ్య అనే రైతు పొలంలోని బావిలో పడిపోయింది. పోలీసులు, ఫారెస్ట్ సిబ్బంది వచ్చి జింకను బయటకు తీశారు.