
సీరియల్స్.. సీరియల్స్.. సీరియల్స్.. ఇంట్లో లేడీస్ ను బానిసను చేసేస్తుంది.. సీరియల్స్ పిచ్చిలో పడి ఇంట్లో ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా లీనం అయిపోతున్నారు కొందరు లేడీస్. సీరియల్స్ పిచ్చిలో పడి ఇంట్లో తిండీ తిప్పలు కూడా పట్టించుకోవటం లేదు.. పిల్లలు చదువుతున్నారా.. కొట్టుకుంటున్నారా.. మొగుడు వచ్చాడా లేదా అనే సోయి కూడా లేకుండా.. టీవీల్లోని సీరియల్స్ కు అతుక్కుపోతున్నారు లేడీస్..
ఇంట్లోని టీవీలో సీరియల్ చూస్తూ పిల్లలను పట్టించుకోవటం లేదంటూ కోప్పడిన భర్తపై.. అలిగి అత్మహత్యా ప్రయత్నం చేసింది ఓ మహిళ. ఈ ఘటన జరిగింది ఏపీ రాష్ట్రం అన్నమయ్య జిల్లా మధనపల్లి పట్టణంలో... వివరాల్లోకి వెళ్తే.. మదనపల్లి పట్టణం శేషప్పతోట కు చెందిన బాబు.. భార్య సోని ఇద్దరు పిల్లలతో కలిసి స్థానికంగా కూలీ పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు.
అయితే 2023 గురువారం జూన్ 29న పనిచేసుకుని బాబు ఇంటికి వచ్చేసరికి సోని టీవీ సీరియల్ చూసుకుంటూ ఉంది. పక్కన ఇద్దరు పిల్లలు కొట్టుకుంటున్న సరే పట్టించుకోకుండా సీరియల్ లో లీనమైపోయింది. దీనిని గమనించిన బాబు... టీవీ ఆఫ్ చేసి పిల్లలు కొట్టుకుంటూ ఉంటే సీరియల్ చూసుకుంటూ ఉన్నావా అని భార్య ను గట్టిగా మందలించాడు.
దీంతో మనస్థాపానికి గురైన సోని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యయత్నం చేసింది. దీంతో ఆమె భర్త బాబు స్థానిక ఆసుపత్రికి తరలించాడు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని సమాచారం.