ఫిర్యాదు పట్టించుకోవట్లేదని.. ప్రజావాణికి కత్తితో వచ్చిన మహిళ

జగిత్యాల జిల్లా  ప్రజావాణిలో ఓ మహిళ కత్తితో హల్ చల్ చేసింది. కలెక్టరేట్ కార్యాలయంలో మార్చి 27న నిర్వహించిన ప్రజావాణికి ఓ మహిళ తన బ్యాగులో కత్తితో వచ్చింది. ఈ విషయం గమనించిన పోలీసులు ఆ మహిళను అడ్డుకుని ప్రజావాణికి వెళ్లకుండా అడ్డుకున్నారు. అయితే కొన్ని రోజులుగా తన ఫిర్యాదులకు ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారుల ముందు తన ఆవేదన చెప్పుకునేందుకు వచ్చినట్లు మహిళ చెబుతోంది.

ఆమె వెంట తెచ్చుకున్న సంచిలో కత్తి ఉండటంతో పోలీసులు ప్రజావాణి అధికారులకు సమాచారాన్ని ఇచ్చారు. ఆ మహిళ మతి స్థిమితం సరిగా లేనట్లు  గుర్తించిన పోలీసులు. ఆమె వెంట వెళ్లి  ఫిర్యాదును ప్రజావాణిలో సమర్పించి వదిలిలేశారు.