తిరుమల భక్తులకు పంగనామాలు పెట్టిన కిలాడి.. డబ్బు తీసుకుని ఎస్కేప్

తిరుమల భక్తులకు పంగనామాలు పెట్టిన కిలాడి.. డబ్బు తీసుకుని ఎస్కేప్

తిరుమల శ్రీవారి భక్తులకు ఓ మహిళ పంగనామాలు పెట్టింది. సుప్రభాత సేవ టిక్కెట్లు, వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు, వీఐపీ గెస్ట్ హౌస్‌లో గదులు ఇప్పిస్తానని నమ్మించి బాధితుల నుండి డబ్బు తీసుకుని ఉడాయించింది. వివరాల ప్రకారం.. హైదరాబాద్‎కి చెందిన వేంకటేశ్వర్ల అనే వ్యక్తికి ఓ మహిళ 5 సుప్రభాత సేవ టిక్కెట్లు, 6 వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు, వీఐపీ గెస్ట్ హౌస్‌లో గదులు ఇప్పిస్తానని చెప్పింది. 

ALSO READ | అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. శబరిమలకు 26 స్పెషల్ ట్రైన్స్..

ఇందు కోసం రూ.41 వేల రూపాయలు ఖర్చు అవుతోందని చెప్పింది. మహిళను నమ్మిన వెంకటేశ్వర్లు ఆమెకు మొత్తం రూ.41 వేల రూపాయిలు ఇచ్చాడు. డబ్బు ఇచ్చినప్పటికీ మహిళా నుండి ఎలాంటి స్పందనకు లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన వేంకటేశ్వర్లు విజిలెన్స్ వింగ్ అధికారులను ఆశ్రయించాడు. 

బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు.. వెంకటేశ్వర్లను టికెట్ల పేరుతో మోసం చేసిన మహిళాను తిరుపతికి చెందిన పాత నేరస్థురాలు కె.నవ్యశ్రీగా గుర్తించారు. విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం నిందితురాలు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితురాలు నవ్యశ్రీ గతంలో రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.