- బంగారం, క్యాష్ ఎత్తుకెళ్లిందనియువకుడి కంప్లయింట్
- భయంతో సూసైడ్ చేసుకున్న దేవరకొండ వాసి
దేవరకొండ, వెలుగు : నల్గొండ జిల్లా దేవరకొండలో పోలీస్ కేసు నమోదైందన్న భయంతో ఓ మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై సతీష్కథనం ప్రకారం..దేవరకొండలోని హనుమాన్‌నగర్‌కు చెందిన భూషరాజు రాణి (23). ప్రస్తుతం హన్మకొండలోని ఒక క్లాత్‌షోరూంలో పని చేస్తోంది. ఈ క్రమంలో అక్కడే పని చేసే సుమన్‌తో సన్నిహితంగా ఉంటోంది.
అయితే, తన నుంచి 10 గ్రాముల బంగారం, రూ. లక్ష నగదు రాణి అపహరించు పోయిందని సుమన్ హన్మకొండ పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో భయపడిన రాణి దేవరకొండ పట్టణంలోని తన ఇంటికి వచ్చి సోమవారం ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి కళమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.