
మియాపూర్, వెలుగు: పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళ సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మియాపూర్‌కు చెందిన సింధు(28)కు ఖమ్మం జిల్లా మొద్దులగూడెం గ్రామానికి చెందిన విక్రమ్‌రెడ్డితో 2018లో పెండ్లి జరిగింది. అనంతరం భార్యాభర్తలు ఇద్దరూ మియాపూర్వైశాలినగర్లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. కొన్ని రోజుల పాటు సింధు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది. భర్త విక్రమ్‌రెడ్డి ఖతార్‌లో ఉద్యోగం చేసి 2025లో ఇండియాకు వచ్చాడు.
ప్రస్తుతం సింధు ఉద్యోగం మానేసి ఇంటి వద్దే ఉంటోంది. పిల్లలు పుట్టకపోవడంతో కొంత కాలంగా బాధ పడుతుంది. ఈ నెల 7న సింధు భర్త విక్రమ్‌రెడ్డి తన తల్లిదండ్రులతో కలిసి పని నిమిత్తం సొంతూరుకు వెళ్లాడు. ఇంట్లో సింధు మాత్రమే ఉండగా, ఆమె తల్లిదండ్రులు, సోదరి ప్రతి రోజు ఫోన్ చేస్తూ మాట్లాడుతుండేవారు. సోమవారం ఉదయం సింధుకు ఆమె తల్లిదండ్రులు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. దీంతో తల్లిదండ్రులు హైదరాబాద్‌లోనే నివాసం ఉండే సింధు సోదరి మౌనికకు కాల్ చేసి విషయాన్ని చెప్పారు. దీంతో ఆమె వెంటనే సింధు నివాసం ఉండే ఇంటి వద్దకు వచ్చి చూడగా, డోర్లోపలి నుంచి లాక్ చేసి ఉంది.
మెయిన్ డోర్‌ను బ్రేక్ చేసి లోపలికి వెళ్లి చూడగా, డైనింగ్ హాల్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని కన్పించింది. వెంటనే స్థానికుల సహాయంతో మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పిల్లలు పుట్టడం లేదనే మనస్తాపంతో సింధు ఉరేసుకొని మృతి చెంది ఉండొచ్చని ఆమె సోదరి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు