అంతా చేయలేని పనులను కొంతమంది మాత్రం చాలా ఈజీగా చేసేస్తుంటారు. ఇంకొందరు వినూత్నమైన సాహసాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలు చూసినప్పుడు.. వీరికేమైనా మానవాతీత శక్తులేమైనా ఉన్నాయా.. అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మహిళ విన్యాసానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. తలపై రెండు గ్యాస్ సిలిండర్లు... వాటిపై ఒక బిందె పెట్టుకుని ఆమె చేసి డాన్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు.
చదువుకోని వారితో చదువుకుని పట్టాలు పొందిన వారు కూడా రీల్స్ కోసం ఆలోచన లేకుండా బిహేవ్ చేస్తున్నారు. తాజాగా, సోషల్ మీడియాలో ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతూ అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. అందులో ఓ మహిళ చీరలో డ్యాన్స్ చేస్తోంది. అది కూడా తలపై రెండు వంట గ్యాస్ సిలిండర్లు దానిపై బిందె కూడా పెట్టుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించింది.
ది ఉమెన్ డేంజరస్ స్టంట్ విత్ గ్యాస్ సిలిండర్... అందులో ఆమె తన తలపై 1 కాదు 2 గ్యాస్ సిలిండర్‌లను పెట్టుకొని బ్యాలెన్స్ చేస్తూ.. డ్యాన్స్ చేసింది. . ఆ సిలిండర్ల పైన కుండ కూడా ఉంది. ఖాళీ సిలిండర్ అయినా 15 కిలోలు ఉంటుంది. అలా రెండు సిలిడర్లు కలిపి 30 కిలోలు వాటిపై ఒక బిందెను తలపై మోస్తూ ... ఈజీగా ఫీట్స్ చేసింది. ఈ వీడియో ఇన్స్ట్రాగ్రామ్ లో _neetu_5650 అనే ఖాతానుండి పోస్ట్ చేయబడింది. ఈ వీడియో ఇప్పటి వరకు 32 లక్షల వీక్షణలను పొందగా అనేకకమంది లైక్ చేసి కామెంట్ చేశారు. . ప్రస్తుతం ఈ వీడియో చూసిన వారు పలు రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
తమలోని ప్రతిభను, ఇష్టాలను, అభిరుచులను పదిమందికి తెలిసేలా రీల్స్, వీడియోలను చేస్తున్నారు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి నెట్టింట్లో సందడి చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో వీడియోలు షేర్ చేసి తమ కళను ప్రదర్శించడం ప్రస్తుతం ఓ ట్రెండ్. అయితే కొంత మంది విచిత్రమైన పనులు చేస్తూ.. రీల్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు కూడా.. అయితే ఇలా రీల్స్ చేస్తున్న సమయంలో ఒకటి చేయాలనుకుంటారు.. మరొకటి జరుగుతుంది. అలాంటి వీడియోలను చూస్తే.. ఫన్నీ కోసం ఇదంతా చేశారా లేదా ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగిందా అని అనే విషయం అర్థం కాదు. అయితే కొన్ని సార్లు రకరకాల ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ ఓ రేంజ్ లో సందడి చేస్తారు. కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేస్తూ చిక్కులను కొని తెచ్చుకుంటుంటే.. కొంతమంది రీల్స్ కోసం ప్రాణాలు కూడా లెక్క చేయడం లేదు. కొందరైతే రీల్ కోసం చనిపోతున్నారు కూడా. ప్రస్తుతం ఇలాంటి సంఘటనలెన్నో వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ జనాల్లో మార్పు రావడం లేదు.