డాకర్ల నిర్లక్ష్యంతో మహిళ చనిపోయిందని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ కుటుంబ సభ్యులు, ఆందోళనకు దిగారు బంధువులు. కాలికి గాయమైందని..హాస్పిటల్ కు వెళ్తే...డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కాలికి శస్త్ర చికిత్స చేస్తుండగా.... మహిళ ప్రాణాలు కోల్పోయింది.
మొయినాబాద్ మండల పరిధిలోని అండాపూర్ గ్రామానికి చెందిన సావిత్రి అనే మహిళ..ఐదు రోజుల క్రితం ఇంటి దగ్గర కిందపడితే..కాలికి తీవ్ర గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక భాస్కర హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుండగా... మహిళ చనిపోయింది. ఐతే సాయంత్రం అయినా బాధితురాలని..కుటుంబ సభ్యులకు చూపించలేదు డాక్టర్లు. అనుమానం రావడంతో డాక్టర్లను ప్రశ్నించారు. చివరికి బాధితురాలు సావిత్రిని చూడడానికి లోపలికి అనుమతించారు. అప్పటికే సావిత్రి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది.
ఏం జరిగిందని..ప్రశ్నిస్తే డాక్టర్లు పొంతనలేని సమాధానం చెప్పారని అంటున్నారు మహిళ కుటుంబ సభ్యులు. దీంతో బంధువులు, గ్రామస్తులు హాస్పిటల్ దగ్గర ధర్నా చేపట్టారు. తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కాని అప్పటికే సావిత్రి మృతి చెందినట్లు చెప్పారు డాక్టర్లు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు మృతురాలి బంధువులు