హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

హైదరాబాద్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో చెరువులు, నాళాలు అక్రమించిన కబ్జాదారుల్లో హైడ్రా దడ పుట్టిస్తుంది. గత రెండు నెలలుగా హైడ్రా వార్తలు బాగా వినిపిస్తున్నాయి. పలు అక్రమ కట్టడాలను కూల్చివేసి దాదాపు 111 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది హైడ్రా.. బఫర్, ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే చాలు కూల్చివేతలే. ఈ క్రమంలో హైడ్రాను రద్దు చేశాలని ఓ మహిళ హైకోర్టులో పిటీషన్ వేసింది. లక్ష్మీ అనే మహిళ వేసిన పిటీషన్ ను హైకోర్టు  విచారించింది. హైడ్రా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 99ను రద్దు చేయాలని పిటీషనర్ కోరింది. ఈ పిటీషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.

హైడ్రా ఏర్పాటు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని పిటీషనర్ తరపు న్యాయవాది వాదించారు. జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారం.. జిహెచ్ఎంసి కి ఉన్న అధికారులను మరొక అథారిటీకి ఇవ్వకూడదని కోర్టులో వాదించారు. జిహెచ్ఎంసికి ఉన్న అధికారులను హైడ్రాకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. జీవో 99 ప్రకారం హైడ్రాకు ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి లేదా ప్రభుత్వ కార్యదర్శి అధికారిగా ఉండాలని పిటీషన్ లో పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం హైడ్రాను ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారి కాకుండా ఉన్న వ్యక్తిని నియమించారని కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.