Thane Woman: పాక్ యువకుడితో పెళ్లి కోసం ఈ యువతి ఎంతపని చేసిందో చూడండి..

Thane Woman: పాక్ యువకుడితో పెళ్లి కోసం ఈ యువతి ఎంతపని చేసిందో చూడండి..

థానే: మహారాష్ట్రలోని థానేకు చెందిన 23 ఏళ్ల యువతి ఫేక్ పాస్ పోర్ట్, వీసాతో పాకిస్థాన్కు వెళ్లొచ్చి చిక్కుల్లో ఇరుక్కుంది. ఆన్లైన్లో పరిచయమైన పాక్ యువకుడిని పెళ్లాడటం కోసం ఆమె దాయాది దేశం వెళ్లొచ్చిందని తెలిసి పోలీసులు కంగుతిన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. నగ్మా నూర్ మక్సూద్ అలీ అలియాస్ సనమ్ ఖాన్ అనే థానేకు చెందిన యువతి ఆధార్ కార్డ్, పాన్కార్డ్లో తన పేరు మార్చుకుంది. థానేలోని లోకమాన్య నగర్లో అతి తెలివికి పోయి ఈ ఫేక్ డాక్యుమెంట్స్ సంపాదించింది. ఫోర్జరీ చేసిన ఆ డాక్యుమెంట్స్ను పాస్పోర్ట్ అప్లికేషన్తో కలిపి అప్లై చేసింది. మొత్తానికి పాస్పోర్ట్ను సంపాదించింది. మే 2023లో పాకిస్థాన్కు వెళ్లింది. 2024, జులై 17న ఇండియాకు తిరిగొచ్చింది.

2021లో ఈ నగ్మాకు పాకిస్థాన్కు చెందిన బాబర్ బషీర్ అహ్మద్తో ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కొన్నాళ్లకు ప్రేమలో పడ్డారు. ఒకరి నంబర్లు మరొకరు తీసుకున్నారు. పాకిస్తానీ వీసా కోసం తొలుత అప్లై చేయగా రిజెక్ట్ అయంది. ఫిబ్రవరి 2024లో బాబర్ను ఆన్లైన్లో పెళ్లాడి వీసా కోసం ప్రయత్నించింది. పాకిస్తాన్ నుంచి జులై 17న ఇండియాకు వచ్చింది. థానేలో ఉండే ఈ యువతి తల్లి కూతురి గురించి చెబుతూ.. 2015లో తన కూతురు భర్తతో విడిపోయిందని.. తన పేరుతో పాటు పిల్లల పేరు కూడా మార్చేసిందని తెలిపింది. థానే పోలీసులు నగ్మాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.