![కీసరలో బైక్ అదుపు తప్పి లారీ కింద పడ్డ మహిళ.. తీవ్ర గాయాలతో దవాఖానకు..](https://static.v6velugu.com/uploads/2025/02/a-woman-lost-control-of-her-bike-and-fell-under-the-lorry--in-hyderabad-keesara_QkiYZreSIx.jpg)
కీసర, వెలుగు: మేడ్చల్ జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మీ, తన కుమారుడితో బైక్ పై ఈసీఐఎల్ కు వెళుతుండగా.. రాంపల్లి చౌరస్తా వద్ద లారీ కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాంపల్లి చౌరస్తాకు రాగానే లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో బైక్ లారీకి ఢీకొని కిందపడిపోగా ధనలక్ష్మీకి తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాద సమయంలో ఆమె కుమారుడు కూడా బైక్ పైనే ఉన్నాడు. తీవ్ర గాయాలైన ధనలక్ష్మీని కేర్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.