ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జూన్ 30న జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరానికి చెందిన రజిత కరీంనగర్లోని సుభాష్నగర్కి చెందిన మహ్మద్ అలీతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో భర్తకు తన పుట్టింటికి వెళ్లి వస్తానని చెప్పి పిల్లలతో కలిసి బయల్దేరింది.
ఆమె అప్పటి నుంచి కనిపించకపోవడంతో బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో బోయినపల్లి మండలం కొదురుపాక మిడ్మానెరు వంతెన వద్ద ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె తన పిల్లలు ఉస్మాన్ అహ్మద్(14), అయ్యన్(7), అశ్రజాబిన్(1) కలిసి మిడ్మానెరులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాలు వెలికి తీసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.