శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం.. 

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో మహిళ ఆత్మహత్యాయత్నం.. 

హైదరాబాద్‌ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ హల్‌ చల్‌ చేసింది. శుక్రవారం (జూన్ 9న) రాత్రి ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లోనే ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అయితే.. ఇది గమనించిన సీఐఎస్‌ఎఫ్‌ (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ కమాండోలు) బలగాలు.. ఆ యువతిని రక్షించారు. 

శుక్రవారం రాత్రి డిపార్చర్‌ విభాగం వద్ద పైనుంచి కిందకు దూకేందుకు సదరు మహిళ ప్రయత్నించింది. వెంటనే అలర్ట్ అయిన సీఐఎస్ఎఫ్ అధికారులు ఆమెను కాపాడి.. మహిళా ఎయిర్‌పోర్ట్‌ అధికారులకు అప్పగించారు. ఆమె కిందకు దూకేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో చాలామంది యువకులు వద్దని వారించారు. సదరు యువతిని బెంగళూరు(సౌత్‌)కి చెందిన శ్వేతగా గుర్తించారు.