
అది నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ ఆలయం. ఊర్కొండ అంజన్నగా పిలుచుకునే ఆంజనేయ స్వామి ఆలయం. హైదరబాద్-శ్రీశైలం మార్గంలో కల్వకుర్తి దగ్గరలో ఉండే ఫేమస్ టెంపుల్. ఎప్పుడూ భక్తులతో సందడిగా ఉండే ఆలయ పరిసర ప్రాంతంలో జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. పవిత్రమైన దేవాలయం దగ్గర ఉన్నామనే ఇంగిత జ్ఞానం మరిచి క్రూర జంతువుల కంటే హీనంగా ప్రవర్తించారు మృగాళ్లు.
వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండపేటలోని అంజన్న ఆలయం దగ్గర ఘోరం జరిగింది. ఆంజనేయ స్వామికి మొక్కులు తీర్చుకోవడానికి దర్శనానికి వచ్చిన భక్తులు .. రాత్రి నిద్ర కోసం అక్కడే నిద్రించారు. మహబూబ్ నగర్ కు చెందిన ఓ యువతి కాలకృత్యాల కోసం ఆలయ సమీపంలోని గుట్ట ప్రాంతం వైపుకు వెళ్లగా.. ఎప్పటి నుంచి మాటు వేశారో తెలియదు. అమ్మాయిని బలవంతం చేయబోయారు.
►ALSO READ | చట్నీలో బల్లి.. పలువురికి అస్వస్థత.. గద్వాల పట్టణంలో ఘటన
అమ్మాయి భయంతో గట్టిగా కేకలు వేయడంతో ఆమె బంధువు వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో బంధువుని చితకబాదారు. అడ్డు వస్తున్నాడని దాడి చేసి చేతులు కట్టేశారు. ఆ తర్వాత ఆ యువతిని బలవంతంగా గుట్ట ప్రాంతం అవతలివైపు ఎత్తుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు.
బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఊర్కొండపేట గ్రామానికి చెందిన 8 మంది ఆకతాయిలు ఈ పని చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. ఇందులో 6 మంది నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.