ఇంట్లోనే మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిండు

ఇంట్లోనే  మహిళను పెట్రోల్ పోసి తగలబెట్టిండు

వికారాబాద్ జిల్లా దారూర్ మండలం రాజాపూర్ లో  దారుణం జరిగింది.  ఏప్రిల్ 24న  బాబయ్య అనే వ్యక్తి  ఓ మహిళను  ఇంట్లోనే  పెట్రోల్ పోసి తగలబెట్టాడు.  స్థానికులు ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

   మహిళతో అక్రమ సంబంధమే ఈ దారుణానికి కారణమని అనుమానిస్తున్నారు. అసలు ఆ మహిళ ఎవరు..ఎందుకు హత్య చేశారనేదానిపై వివరాలు ఆరాదీస్తున్నారు. నిందితుడు బాబయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.