షాద్ నగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఏబీవీ మల్టీ స్పెషల్ హాస్పిటల్‌లో కొందుర్గు మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన మణెమ్మ (55) జలుబు, దగ్గు జ్వరంతో మూడు రోజుల కింద అడ్మిట్ అయింది. మూడు రోజుల పాటు చికిత్స అందించిన డాక్టర్లు.. పరిస్థితి విషమించిందని షాద్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లాలంటూ మణెమ్మ డెడ్‌బాడీని ఇచ్చారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే మణెమ్మ చనిపోయిందన్నారు. గురువారం కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. ఇప్పటికైనా హాస్పిటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.