తప్పిపోయిన కుక్క పోస్టర్ తొలగించినందుకు హౌసింగ్ సొసైటీ ప్రెసిడెంట్‌ను ఓ మహిళ కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఈ సంఘటన జరిగింది. సెక్టార్ 75లోని ఎయిమ్స్ గోల్ఫ్ అవెన్యూ సొసైటీలో నివసిస్తున్న ఆషి సింగ్ అనే మహిళ పెంపుడు కుక్క తప్పిపోయింది. దీంతో ఆమె కుక్క మిస్సింగ్ పోస్టర్‌ను సొసైటీ ప్రాంగణంలో అంటించారు.
సొసైటీ అధ్యక్షుడు నవీన్ మిశ్రా ఈ పోస్టర్‌ను తొలగించాడు. శుక్రవారం (సెప్టెంబర్ 22న) ఆషి సింగ్ దీని గురించి అతడ్ని నిలదీసింది. నవీన్ మిశ్రా కాలర్ పట్టుకున్న ఆమె అతడితో గొడవకు దిగింది. సుప్రీంకోర్టు కంటే అపార్ట్‌మెంట్ ఓనర్స్ అసోసియేషన్ పెద్దదా..? అని ప్రశ్నించింది. అయితే.. తన కాలర్‌ను విడిచిపెట్టాలని నవీన్ ఆమెను కోరాడు. అలాగే మర్యాదగా మాట్లాడాలని అన్నాడు. దీంతో ఆషి సింగ్ రెచ్చిపోయింది. నవీన్ జుట్టుపట్టుకుని అతడి చెంపపై కొట్టింది. ఇంతలో అక్కడున్న కొందరు వ్యక్తులు జోక్యం చేసుకుని విడిపించారు.
మరోవైపు బీజేపీకి చెందిన నవీన్ మిశ్రా ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక వ్యక్తి మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
नोएडा:-
— पत्रकार अमर सैनी (@AmarSai91829221) September 23, 2023
यह है नोएडा की सोसाइटी का हाल, सोसाइटी के प्रेसिडेंट व महिला के बीच मिसिंग कुत्ते के पोस्टर को लेकर हुआ विवाद, खूब हुई गाली-गलौज, वीडियो हुआ वायरल।PS 113@Uppolice @noidapolice @CP_Noida @SaharaSamayUP pic.twitter.com/l6wRrpfYSh