
హైదరాబాద్ లో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. కుత్భుల్లాపూర్ అపురూపకాలనీలో తాళం వేసిన .. ఇంట్లో చొరబడిన దొంగలు బీభత్సం సృష్టించారు. ఏకంగా 20తులాల బంగారు ఆభరణాలతో పాటు ..అరకిలో వెండి.. 15 వేల నగదు ఎత్తుకెళ్లారు. మరో ఘటనలో ఆల్విన్ కాలనీలో పట్టపగలే ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. ఫేస్ 1 లో ఇంట్లోని వారు ఆరు బయట పని చేసుకుంటుండగా ఇంటిలోకి ప్రవేశించిన ఓ మహిళ బీరువా తెరిచి బంగారు, వెండి ఆభరణాలు అపహరించింది. ఈ రెండు ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కుత్భుల్లాపూర్ లో...
జీడిమెట్ల పీఎస్ పరిధిలోని అపురూప కాలనీలో భారీ చోరీ జరిగింది. పింటు హ్యుడేట్ అనే వ్యక్తి కుటుంబం తన ఫ్యామిలీతో ఓ పంక్షన్ కి కోల్ కత్తా కి వెళ్లారు. తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. చోరీ ఘటనను గమనించిన స్థానికులు 20తులాల బంగారు ఆభరణాలతో పాటు ..అరకిలో వెండి.. 15వేల నగదు చోరికి గురైనట్టు బాధితుడు పోలీస్ స్టేషన్ లో పిర్యాదుచేశారు. కేసునమోదు చేసి సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆల్విన్ కాలనీలో మరో చోరీ
ఆల్విన్ కాలనీలో ఓ మహిళ దొంగ రెచ్చిపోయింది. పట్ట పగలే తలుపులు తీసి ఉన్న ఓ ఇంట్లోకి చొరబడి.. ఆ ఇంట్లో నుంచి బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లింది. హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆల్విన్ ఫేజ్ 1, జలకన్య హోటల్ దగ్గరలో ఓ ఇంటిలో మిట్ట మధ్యాహ్నం చోరీ జరిగింది.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆల్విన్ కాలనీలో ఓ భారీ చోరీ జరిగింది. తలుపులు తీసి ఉన్న ఇంట్లో ఓ మహిళ చోరీకి పాల్పడింది. ఇంట్లోని వారు ఆరు బయట పని చేసుకుంటుండగా ఇంటిలోకి ప్రవేశించిన ఓ మహిళ బీరువా తెరిచి బంగారు, వెండి ఆభరణాలు అపహరించింది. 7తులాల బంగారు ఆభరణాలు, 10 తులాల వెండి గొలుసులు అపహరణకు గురయ్యాయని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.