సినిమా చాన్స్ ఇప్పిస్తానని రూమ్కు పిలిచి.. మహిళపై లైంగిక దాడి

సినిమా చాన్స్ ఇప్పిస్తానని నమ్మించి ఓ మహిళపై లైంగికదాడికి పాల్ప డిన ఒకరిపై జూబ్లీహిల్స్ పీఎస్ లో కేసు నమోదయ్యింది. ఏపీకి చెందిన మహిళ భర్తతో విడిపోయి మణికొండలో హౌస్ కీపింగ్ పని కోసం వచ్చింది. 15 రోజుల కిందట అమీర్ పేటలోని ఓ హాస్టల్లో చేరింది. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా ప్రయత్నించేందుకు కృప్లానగర్ ప్రాంతంలో తెలిసిన వారిని వాకబు చేసింది.

ALSO READ | మేనకోడలినే బ్లాక్ మెయిల్ చేసిన నీచుడు.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యలో ట్విస్ట్

 ఈ క్రమంలో డైరెక్షన్ విభాగంలో పనిచేస్తున్న కాటేకొండ రాజుతో పరిచయం ఏర్పడింది. మూడు రోజుల క్రితం ఆడిషన్స్ ఉన్నాయంటూ కృష్ణానగర్ లోని ఓ హోటల్ కు ఆమెను పిలిపించాడు. ఫస్ట్ ఫొటోషూట్ చేసి మరుసటి రోజు రావాలని చెప్పాడు. సెకండ్ వెళ్లగా.. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురా లిఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.