బస్టాపులోని మహిళను కిడ్నాప్ చేసి రేప్.. ఆ తర్వాత దోచుకుని వెళ్లారు

బస్టాపులోని మహిళను కిడ్నాప్ చేసి రేప్.. ఆ తర్వాత దోచుకుని వెళ్లారు

బెంగుళూర్: కర్నాటక రాజధాని బెంగుళూరులో దారుణం జరిగింది. బస్టాప్‎లో ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారం చేసిన దుండగులు ఆ తర్వాత బాధితురాలి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు బెంగుళూర్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీస్ కమిషనర్ బీ దయానంద మీడియాకు వెల్లడించారు. బెంగళూరులోని కేఆర్ మార్కెట్ వద్ద యలహంక వెళ్లేందుకు సోమవారం (జనవరి 20) అర్థరాత్రి ఓ మహిళ  బస్టాప్‎లో బస్సు కోసం వేసి చూస్తోంది.

రాత్రి వేళ మహిళా ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఇద్దరు దుండగులు.. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారం చేసిన అనంతరం బాధితురాలి వద్ద ఉన్న నగదు, మొబైల్ ఫోన్ ఎత్తుకెళ్లారు. స్థానికుల సహయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బెంగళూరు సెంట్రల్ డివిజన్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌‎లో కేసు నమోదు చేసిన పోలీసులు.. ఘటన స్థలంలోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించి ఇద్దరిని నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ కేసు తదుపరి విచారణ జరుగుతోందని బెంగళూరు పోలీస్ కమిషనర్ బీ దయానంద పేర్కొన్నారు. 

Also Read :- హోటల్ లో భారీ అగ్నిప్రమాదం.. 66 మంది మృతి

అర్థరాత్రి మహిళాపై అత్యాచారం జరిగిన ఘటన పొలిటియల్ యాంగిల్ తీసుకుంది. ఈ ఘటనపై అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు క్షీణించాయని.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేకుండాపోయిందని బీజేపీ విమర్శలు గుప్పించింది. బీజేపీ వ్యాఖ్యలకు సీఎం సిద్ధరామయ్య కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో మహిళాలపై జరిగిన అఘాయిత్యాల సంగతి ఏంటని నిలదీశారు. మహిళాపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు.