కరీంనగర్ జిల్లా వీణవంకలో కటౌట్ కూలి ఓ మహిళకు తీవ్రగాయాలయ్యాయి. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షం, ఈదురు గాలులతో వీణవంకలో కేంద్రంలో ఏర్పాటు చేసిన కటౌట్ కూలి కింద పడింది. దీంతో అటు గా వెళ్తున్న మహిళపై పడటంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. చికిత్సకోసం మహిళను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇటీవల ఆశీర్వాద సభకోసం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కటౌట్ ఏర్పాటు చేశారు. సభ అయిపోయిన మూడు రోజుల తర్వాత కూడా కటౌట్ తొలగించకపోవడంతో గాలివానకు కూలిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.