Viral Video: వామ్మో.. లండన్ రోడ్లపై యువతి లుంగీతో హల్ చల్

ప్రస్తుతం సోషల్ మీడియా హవా నడుస్తోంది. చిన్న పిల్లల నుంచి మొదలుకుని ముసలివాళ్ల వరకు సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ హల్ చల్ చేస్తున్నారు. ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ నడుస్తోంది. సోషల్ మీడియా ఉంటే చాలు.. సమాజానికి తెలియని చాలా మంది ఇప్పుడు ఎక్కడ చూసినా గుర్తుపట్టేలా ఉంటున్నారు. ఈ తరుణంలో వివిధ వీడియోలు చేస్తూ ఆకర్షిస్తున్నారు. అయితే తాజాగా ఓ మహిళ లుంగీ కట్టుకుని రోడ్లపై తిరుగుతూ ఓ వీడియో చేసింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

భారతీయ సంప్రదాయ దుస్తులలో లుంగీ ఒకటి. నేటికీ, గ్రామీణ ప్రాంతాల్లో పురుషులు ఇంటి వద్ద ఉన్నప్పుడు, ఊళ్లు పనుల మీద వెళ్లేందుకు లుంగీ కట్టుకుంటారు. ఇప్పుడు మన సంస్కృతి ప్రకారం పండుగలు, వివాహ కార్యక్రమాలు లేదా దేవాలయాలను సందర్శించే సమయంలో నగర కుర్రాళ్ళు కూడా తెల్లటి పట్టు పంచె ధరిస్తారు. అలానే ఓ యువతి లుంగీ కట్టుకుని హల్ చల్ చేసింది. మగవాళ్ల కంటే నేనేం తక్కువ కాదు.. అన్నట్టుగా ఓ యువతి లండన్ వీధుల్లో  హంగామా సృష్టించింది.

Also read :గ్రీన్ మిర్చి హల్వా..ఈ స్పైసీ ఫుడ్ వీడియో వైరల్ 

ఇంగ్లండ్ ప్రజల స్పందనను చూసేందుకు కంటెంట్ సృష్టికర్త వావేరి అనే యువతి లుంగీ కట్టుకుని లండన్ వీధుల్లో నడిచింది. ఆమె ఈ వీడియోను తన (@valerydaania) Instagram ఖాతాలో పోస్ట్ చేసింది. వైరల్ వీడియోలో వాలెరీ లుంగీతో లండన్ వీధుల్లో నడుస్తూ ఒక దుకాణంలోకి కూడా వెళ్తుంది. అక్కడ పనిచేసే వ్యక్తి ఆమె ప్రత్యేకమైన దుస్తులపై చాలా ఆసక్తి చూపించాడు. చుట్టుపక్కల ఉన్నవారంతా ఆమె డ్రెసింగ్ స్టైల్ చూసి ఎలా స్పందిస్తారో కూడా వీడియోలో చూపిస్తుంది. ఈ డ్రెస్ చూసిన విదేశీయులు ఆమె లుంగీ ఫ్యాషన్ చూసి కంగారు పడ్డారు.భారతీయ సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తున్నందుకు ఆమెను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by valery (@valerydaania)

లుంగీ...  టీ షర్ట్ వేసి..  కళ్లజోడు పెట్టుకుని లండన్ వీధుల్లో తిరుగుతున్న ఓ యువతి వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేల సంఖ్యలో వ్యూస్ ను  సొంతం చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియలో తెగ వైరల్ అవుతోంది. ఆమె లుంగీ అవతారంపై విదేశీయులు స్పందించారు. 

రోడ్డుపై లుంగీని కట్టి అద్దాలు పెట్టుకుని రెడీ అయింది. లండన్ వీధుల్లో లుంగీని ధరిస్తున్నాను అని పేర్కొంది. లుంగీని ధరించి రోడ్డుపై తిరుగుతూ, మాల్స్ లోను సందడి చేసింది. సరుకులు తీసుకునేందుకు వెళ్లి అక్కడ చుట్టూ ఉన్న జనం తన వేషాధరణ చూసి రియాక్ట్ అయ్యే తీరును కూడా వీడియోలో చూపించింది. అనంతరం ఓ ముసలి ఆవిడను తన వేషాధరణ ఎలా ఉందని అడిగి తెలుసుకుంది. ఐ లవ్ ఇట్ అంటూ ఆమె రిప్లై ఇచ్చింది. ఏది ఏమైనా లుంగీలో మహిళ తిరిగిన వీడియో వైరల్ అవుతోంది. మే 12న షేర్ చేసిన ఈ వీడియోకు 1.1 మిలియన్ల వీక్షణలు రావడంతో యువతి కొత్త ట్రెండ్ ను  నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. భారతీయ సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తున్నందుకు ఆమెను నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు.