పెళ్లి రోజునే సవతి పిల్లలను చంపి ఉరేసుకున్న మహిళ

పెళ్లి రోజునే సవతి పిల్లలను చంపి ఉరేసుకున్న మహిళ

నల్గొండ అర్బన్, వెలుగు: సవతి పిల్లలను చంపి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని జూబ్లిహిల్స్​కాలనీలో గురువారం ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఐసీడీఎస్​లో ఆపరేటర్​గా చేస్తున్న మేకల ప్రదీప్​ 1999లో ఇదే శాఖలో పని చేస్తున్న ప్రసన్నరాణి(45)ని వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. ఇదేశాఖలో డ్యూటీ చేస్తున్న శాంతి అనే మహిళను ప్రదీప్​2012లో రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్​కాలనీలో ప్రసన్నరాణి, బీటీఎస్​లో శాంతి వేర్వేరుగా ఉంటున్నారు. కలిసి ఉందామంటూ ప్రసన్నరాణి 40 రోజులుగా అందరిని నమ్మిస్తోంది. ఈ క్రమంలో చిన్న భార్య శాంతి పిల్లలు మేదశ్రీ(7), రుచిర(5)ను గురువారం బీటీఎస్​నుంచి జూబ్లీహిల్స్​కు తీసుకొచ్చింది. ఇంట్లో ఎవరూ  లేని సమయం చూసి చిన్నారుల మెడకు బొందెలతో ఉరివేసి దారుణంగా హతమార్చింది. అనంతరం ఫ్యాన్​కు ఉరేసుకుంది. ఎంతో ఇష్టపడిన తన భర్త రెండో పెళ్లి చేసుకోవడంపై ప్రసన్న రాణి తీవ్ర మనస్తాపానికి గురైంది. దాంతో తన పెళ్లి రోజే సవతి పిల్లలను చంపి సూసైడ్​చేసుకుంది. ఎనిమిదేళ్లుగా తన భర్త కారణంగా పడిన మానసిక సంఘర్షణను తెలియజేస్తూ ఆమె రాసిన లెటర్​ పోలీసులకు లభ్యమైంది.

For More News..

రైతు హక్కులకూ రక్షణ ఉండాలె

ప్రేమపెళ్లి చేసుకున్న బిడ్డల్ని చంపితే పరువు నిలుస్తుందా?

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌‌‌‌లో టాప్‌‌‌‌లో కోహ్లీ