యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా జెడ్చర్లకి చెందిన సుందరమ్మ అనే మహిళ భారీ విరాళం ఇచ్చారు. సుమారు రూ.20 లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఆలయ అధికారులకు అందించారు. స్వామికి పెద్ద మొత్తంలో విరాళం అందించడం ఎంతో ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మరోవైపు.. ఇవాళ ఆలయ ప్రధానర్చకుల బృందం విశిష్ట పూజా కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. 11 రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. యాదాద్రికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.