![నడి రోడ్డుపై.. బండ రాయితో కొట్టి కొట్టి చంపేశారు](https://static.v6velugu.com/uploads/2023/04/mancherial_bVBya6Gor4.jpg)
మంచిర్యాల జిల్లాలో దారుణ్య హత్య జరిగింది. ప్రేమ పేరుతో వేధిస్తోన్న మహేష్ అనే ఓ యువకుడిని యువతితో పాటుగా ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు బండి రాయితో కొట్టి కొట్టి హతమార్చారు. జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
అందరూ చూస్తుండగానే ఈ సంఘటన జరిగినప్పటికి ఎవరూ కూడా ఆపేందుకు ముందుకు రాలేదు. మహేష్ గతంలో తన ఇంటి ముందు నివసించే మహిళను వేధించేవాడని ఈ క్రమంలోనే మహిళ భర్త సంవత్సరం క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని తెలుస్తోంది.
అయినప్పటికీ మహేష్ ఆ మహిళపై వేధింపులు ఆపలేదు. పోలీస్ స్టేషన్ లో పలుమార్లు కేసు పెట్టిన మహేష్ వేధింపులు ఆగకపోవడంతో భరించలేకపోయిన ఆ మహిళ ఆగ్రహంతో మహేష్ ను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి రాళ్లతో కొట్టి చంపేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.