-
లైంగికంగా వాడుకున్నావంటూ గాజులరామారం సర్కిల్ఆఫీసులో దాడి
-
అలాంటిదేమీ లేదన్న డీసీ
జీడిమెట్ల, వెలుగు: గాజులమారం సర్కిల్ ఆఫీస్ టౌన్ ప్లానింగ్విభాగంలో పనిచేసే అధికారిని ఓ మహిళ చెప్పుతో కొట్టింది. శుక్రవారం సర్కిల్ఆఫీసుకు వచ్చిన మహిళ నేరుగా టౌన్ప్లానింగ్ఆఫీసర్దగ్గరకు వెళ్లి ‘నన్ను లైంగికంగా వాడుకున్నావ్.. నా జీవితాన్ని నాశనం చేశావ్’ అంటూ చెప్పుతో కొట్టింది. ఏం జరుగుతుందో తెలియక అక్కడి సిబ్బంది నిర్ఘాంతపోయారు. సదరు అధికారి వెంటనే ఆమెను అక్కడి నుంచి తీసుకువెళ్లిపోయాడు. దీనిపై డిప్యూటీ కమిషనర్ మల్లారెడ్డిని వివరణ కోరగా తనకు సమాచారం రావడంతో విచారణకు వెళ్లానని, కానీ అక్కడ అలాంటిదేమీ లేదని సిబ్బంది చెప్పారని తెలిపారు. కంప్లయింట్ వస్తే చర్యలు తీసుకుంటామన్నారు.