శంషాబాద్లో విషాదం .. పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి

శంషాబాద్లో విషాదం ..  పిల్లలకు విషం ఇచ్చి ఉరేసుకున్న తల్లి

శంషాబాద్ లో విషాదం చోటుచేసుకుంది.  పాపకు విషమిచ్చి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఓ మహిళ. మృతురాలని ప్రియాంక (26) గా పోలీసులుగుర్తించారు. పోలీసులు తెలిపిన వివారాల ప్రకారం... కర్నాటక బీదర్‌ నుంచి వచ్చిన కుటుంబం శంషాబాద్ అర్బీనగర్‌లో అద్దెకు ఉంటోంది. భర్త సోమాశేఖర్ కొరియర్‌ ఆఫీస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు.  ప్రియాంక ఇంట్లోనే ఉంటుంది.  కొంతకాలంగా బార్యభర్తల మధ్య గొడవలు వస్తుండటంతో ప్రియాంక ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.  భర్త ఇంట్లో లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని నిలోఫర్ హస్పటల్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారణాలపై ఆరా తీస్తున్నారు.