
పాత సైకిల్‌తో కొత్త ఆలోచన చేసిందో యువతి. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌కు చెందిన కల్యాణి తనకున్న అద్దెకరంలో పత్తి వేసింది. కలుపు మొక్కలను తీసేందుకు కొత్త ఆలోచన చేసింది. ఇంట్లోని పాత సైకిల్‌ను రూ.1200తో రిపేర్ చేయించి కలుపు యంత్రంగా మార్చివేసింది. దాంతో ఇలా శ్రమిస్తోంది. - వెలుగు, ఫొటోగ్రాఫర్, సిద్దిపేట