- మైనర్‌తో వ్యభిచారం చేయించిన దోషి కి జీవితఖైదు
- రూ.3.19 లక్షల జరిమానా
ఎల్బీనగర్, వెలుగు: మైనర్‌తో వ్యభిచారం చేయించి, చిత్రహింసలకు గురి చేసిన నిందితురాలికి రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టు జీవిత ఖైదుతో పాటు రూ.3.19 లక్షల జరిమానా విధించింది. అడిషనల్ పీపీ కోమలత వివరాల ప్రకారం.. ఖమ్మం పట్టణానికి చెందిన కుక్కల ఆశ అలియాస్ సైధాజీ(25) ఒక మైనర్‌ను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దింపింది. ఆమెను బంధించి నిత్యం చిత్రహింసలకు గురి చేస్తున్నది. హయత్ నగర్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై 2023లో పోలీసులు దాడి చేయగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆధారాలు సేకరించిన హయత్ నగర్ పోలీసులు ఎల్బీనగర్ లోని రంగారెడ్డి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో సబ్మిట్ చేశారు. వాటిని పరిశీలించిన జిల్లా స్పెషల్ సెషన్స్ జడ్జి హరీష శుక్రవారం తీర్పు వెలువరించారు.