Viral Video: వావ్... నెత్తిపై ఈత కొడుతున్న చేపలు

చెరువులు, కుంటలు, కాలువల్లో చేపలు ఉంటాయి.  మత్స్య కారులు  వాటిని వల వేసిట్టుకుంటారు.   కాని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  వీడియోలో ఓ మహిళ నెత్తిపై చేపలు ఈత కొడుతున్నాయి.  ఆ మహిళ తల చిన్నపాటి చెరువును తలపిస్తుంది.  

చేతిలో స్మార్ట్ ఫోన్.... సోషల్ మీడియా ఎక్కౌంట్ ఉంటే చాలు జనాలు ఫేమస్ అయ్యేందుకు పడే తాపత్రయం అంతా ఇంతా కాదు.  సోషల్ మీడియాలో ట్రెండ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వాలని చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇప్పుడు ఓ వింత హెయిర్ స్టైల్ కు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతుంది..వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ మహిళ సెలూన్‌లో కూర్చుని ఉంది. అక్కడి స్టైలిస్టులు ఆమె హెయిర్‌కు ఏవోవో రకరకాల జెల్స్ పూస్తున్నారు. చివరికి ఆ మహిళ తలపై ఉన్న జుట్టును  ఓ పాత్ర ఆకారంగా మార్చారు. ఆ తర్వాత అందులో మరో వ్యక్తి నీటిని వేశాడు. అందులో చిన్న చిన్న చేప పిల్లలు కూడా ఉన్నాయి. ఆమె జుట్టులో ఆ చేప పిల్లలు చక్కగా ఈత కొడుతున్నాయి.. 

ALSO READ :- Operation Valentine OTT: ఆపరేషన్ వాలెంటైన్ ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎక్కడ?

ఓ ఇన్ స్టా వినియోగదారుడు ఈ వీడియోను షేర్ చేశాడు.. .ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. వీడియోను ఇప్పటివరకు ( వార్త రాసే సమయం వరకు)  మిలియన్ మందికి పైగానే చూశారు. 43 వేల లైక్‌లు కూడా అందుకుంది ఈ వీడియో. ఇక ఈ డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూసిన నెటిజన్లు ఊరుకుంటారా.. రకరకాల కామెంట్లు పెడితూ.. వైరల్ వేస్తున్నారు… ఫన్నీ కామంట్లతో వీడియో చక్కర్లు కొడుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి.