Viral Video .. వావ్.. ఇంటిని క్లీన్ చేసినట్టు .. ట్రైన్ బెర్త్ ను తుడిచింది.

Viral Video .. వావ్.. ఇంటిని క్లీన్ చేసినట్టు .. ట్రైన్ బెర్త్ ను తుడిచింది.

కరోనా తరువాత జనాలు క్లీనింగ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు.  ఈ మధ్య ట్రైన్ లో ప్రయాణించేటప్పుడు సీట్లను క్లీనింగ్ చేసే పనిని మొదలు పెట్టారా ...అంటే ఈ వీడియో చూస్తూ నిజమే అనిపిస్తుంది.  ట్రైన్ సెకండ్ ఏసీ ప్రయాణికురాలు సీట్లను క్లీన్ చేసిన  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

ట్రైన్ లో ప్రయాణిస్తున్న మహిళ లిక్విడ్ క్లీనింగ్ స్ప్రే.. క్లాత్.. స్క్రబ్బర్ ను ఉపయోగించి బెర్త్ ... టేబుల్.. విండోలను  క్లీన్ చేసిన వీడియో ప్రియాశర్మ తన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేస్తూ.. చిన్న చిన్న వ్యర్ధాలను మీరే క్లీన్ చేసుకోండి. స్వచ్ఛ భారత్ ను మీతోనే మొదలు పెట్టండి అంటూ ప్రియా క్యాప్షన్ పెట్టారు. 

ఈ వీడియోను యూజీసీ సృష్టికర్త ప్రియా శర్మ  హౌస్‌వైఫ్_టు_హోమ్‌మేకర్  తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. స్వచ్ఛ భారత్ మీతోనే మొదలవుతుంది -..  పరిశుభ్రతను అలవాటు చేసుకోండి  ప్రియా శర్మ అన్నారు. ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం వరకు)  13.3 మిలియన్ల మంది వీక్షించారు.  

ఈ వీడియో స్పందించిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.   ప్రియాశర్మ చేసిన పనిని కొందరు ప్రశంసించగా.. మరికొందరు  మనం ట్యాక్స్ లు కడుతున్నాం.. మనం ఎందుకు క్లీన్ చేయాలని ప్రశ్నించారు. మరొకరు  ఇది చాలా  అద్భుతమైన పని అంటూ..  రైలు బయలుదేరే ముందు ప్రయాణీకులు కూర్చొనే ప్లేస్  శుభ్రంగా ఉందని నిర్ధారించుకుంటే, అది పెద్ద మార్పును కలిగిస్తుందన్నారు.  ఇంకొకరు  టిక్కెట్ కోసం డబ్బు చెల్లించి ...  సీట్లు శుభ్రం చేయాలా?  అంటై రైల్వే అధికారులకు ఫిర్యాదు చేస్తే క్లీనింగ్ స్టాఫ్ ఆ పని చేస్తారని రాసుకొచ్చారు.