హైదరాబాద్, వెలుగు: అర్బన్ ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణ, పునర్నిర్మాణంపై మంగళవారం సిటీలోని హోటల్ తాజ్ కృష్ణలో వర్క్షాపు నిర్వహించారు. తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్టుమెంట్ల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ ఎన్టీఓల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్యానెల్ డిస్కషన్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ మాట్లాడుతూ.. చెరువుల పునరుద్ధరణ, పరిరక్షణపై ప్రజల భాగస్వామ్యం, ప్రభుత్వ సహకారం తెలియజేశారు. పలు ఎన్టీఓల ప్రగతి, అనుసరించిన విధానాలను అడిగి తెలుసుకున్నారు. డిస్కషన్లో దృవాన్ష్ ఎన్టీఓ ప్రతినిధి మధులిక, సహే ఎన్టీఓ ప్రతినిధి కల్పన రమేశ్, సఖి వాటర్ ఎన్టీఓ ప్రతినిధి కె.శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఏదో ఒక కారణంతో రిజెక్ట్ కరెక్ట్ కాదు
టౌన్ ప్లానింగ్ అధికారులు టీజీ బీపాస్ అప్లికేషన్లను నిర్ణీత గడువులోగా ఓకే చేయాలని, ఏదో ఒక కారణంతో అప్లికేషన్లను రిజెక్ట్చేయడం కరెక్ట్కాదని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ చెప్పారు. మంగళవారం జీహెచ్ఎంసీ హెడ్డాఫీసులో టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. బిల్డింగ్ పర్మిషన్లను లేట్చేయొద్దన్నారు. అనుమతుల ఆలస్యంపై ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. నాలుగైదు నెలల్లో షార్ట్ ఫాల్స్, రిజెక్ట్ చేసిన దరఖాస్తుల వివరాలు అందించాలని కోరారు. టౌన్ ప్లానింగ్ అధికారులు పనితీరును మార్చుకోవాలని సూచించారు. షార్ట్ ఫాల్స్, రిజెక్టెడ్అప్లికేషన్ల వివరాలు, పెండింగ్ అప్లికేషన్ల వివరాలను సర్కిల్ వారీగా సమీక్షించారు. సమావేశంలో జీహెచ్ఎంసి చీఫ్ సిటీ ప్లానర్ రాజేంద్ర ప్రసాద్ నాయక్, సీపీలు, ఏసీపీలు, సెక్షన్ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.