- విశ్వసుందరి కిరీటాన్ని అందుకున్న విక్టోరియా థెల్వింగ్
- టాప్ 30తోనే సరిపెట్టుకున్న ఇండియా యువతి రియా సింఘా
మెక్సికో: మిస్ యూనివర్స్– 2024 విజేతగా డెన్మార్క్ యువతి నిలిచింది. విశ్వసుందరి కిరీటం 21 ఏండ్ల విక్టోరియా కేయిర్ థెల్వింగ్ను వరించింది. 125 మంది బరిలో నిలిచిన ఈ పోటీల్లో విక్టోరియా గెలిచి.. డెన్మార్క్‌కు తొలిసారి మిస్ యూనివర్స్ కిరీటాన్ని తెచ్చిపెట్టింది.
మెక్సికోలో శనివారం రాత్రి జరిగిన ఫైనల్ పోటీల్లో నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్సినా సెకండ్ ప్లేస్‌లో, మెక్సికోకు చెందిన మారియా ఫెర్నాండా బెల్ట్రాన్ థర్డ్ ప్లేస్‌లో నిలిచారు. 2003లో డెన్మార్క్‌లో పుట్టిన విక్టోరియా.. జంతుసంరక్షణ అడ్వకేట్‌గా పనిచేస్తున్నది.
డెన్మార్క్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తెచ్చిపెట్టిన తొలి యువతిగా ఆమె రికార్డు సృష్టించింది. విక్టోరియాకు కిరీటాన్ని 2023 విశ్వసుందరి షెన్నీస్ పలాసియోస్ అలంకరించింది. ‘‘కొత్త అధ్యాయం మొదలైంది. 73వ మిస్ యూనివర్స్ పోటీల్లో విజేతగా నిలిచిన డెన్మార్క్‌కు అభినందనలు.
మహిళా సాధికారతకు స్ఫూర్తినింపేలా విక్టోరియా ప్రయాణం ముందుకుసాగాలని ఆశిస్తున్నం” అంటూ మిస్ యూనివర్స్ పోటీల నిర్వాహకులు ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. భారత్ నుంచి పోటీల్లో పాల్గొన్న గుజరాత్‌కు చెందిన రియా సింఘా టాప్ 30తోనే సరిపెట్టుకుంది.
స్విమ్ షూట్ పోటీల నుంచే ఆమె వెనుదిరిగింది. ఫైనల్ రౌండ్లో 12 మంది పోటీ పడగా.. ఇందులో ఏడుగురు లాటిన్ అమెరికా దేశాలకు చెందిన వాళ్లే కావడం విశేషం.