సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా జాగ్రత్తగా ఉండాలంటూ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పిన కొంతమంది వీరి ఉచ్చులో పడి జేబులు గుల్ల చేసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ యువతి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయింది. సైబరాబాద్‌లో నివసించే ఒక మహిళకు సైబర్ కేటుగాళ్ళ వల వేశారు. మహారాష్ట్ర పోలీసులమంటూ ఫోన్ చేశారు. మనీలాండరింగ్ కేసులో మీరు నిందితులంటూ ఫోన్ లో మాట్లాడారు అగంతకులు.. మీపై వారెంట్ పెండింగ్‌లో ఉందని సైబర్ కేటుగాళ్ళు భయపెట్టారు.
బాధితురాలిని రాత్రంతా స్కైప్ వీడియో కాల్‌లో ఉండమని బలవంతం చేశారు. భయంతో మోసగాళ్లు సూచనల మేరకు కేటుగాళ్ళ ఖాతాకు బాధితురాలు రూ. 60 లక్షలు బదిలీ చేసింది. మోసాన్ని గ్రహించి, వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు స్పందించి మొత్తం నగదును ఫ్రీజ్ చేశారు. వేగంగా స్పందించిన కాల్ సెంటర్ సిబ్బందిని అదనపు సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు.