
కారేపల్లి , వెలుగు : అడవి పందులను పట్టేందుకు వేటగాళ్లు వేసిన కరెంటు ఉచ్చు తగిలి యువకుడు మృతిచెందాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం.. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడు గ్రామానికి చెందిన మేకల కరుణాకర్ (20) తన మేకలు తప్పిపోవడంతో వెతుక్కుంటూ ఆదివారం రాత్రి తిమ్మారావుపేట సమీపంలోని వాగు వైపు వెళ్లాడు. అక్కడ అడవి పందులను పట్టేందుకు వేటగాళ్ల ఏర్పాటు చేసిన కరెంటు ఉచ్చు తగిలి కరుణాకర్ స్పాట్ లో చనిపోయాడు. మృతుడి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.