బాలికపై లైంగికదాడి.. యువకుడికి పదేండ్ల జైలు

బాలికపై లైంగికదాడి.. యువకుడికి పదేండ్ల జైలు

మియాపూర్, వెలుగు: బాలికపై లైంగికదాడి కేసులో యువకుడికి పదేండ్ల జైలు శిక్ష పడింది. మియాపూర్ పోలీసుల వివరాల ప్రకారం.. ఈస్ట్ గోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడు లంకకు చెందిన రమేశ్( 22) హైదరాబాద్ బోరబండలో ఉంటూ కార్పెంటర్​గా పని చేస్తున్నాడు. స్థానికంగా ఉండే బాలిక (17)కు ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. 2018లో ఆమెను విజయవాడకు తీసుకెళ్లి పెండ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో  పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. ఈ కేసులో చార్జిషీట్ ఫైల్ చేయగా, బుధవారం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ స్పెషల్ పోక్సో కోర్టులో విచారణకు వచ్చింది. నిందితుడిని కోర్టు దోషిగా నిర్ధారిస్తూ  పదేండ్ల జైలు శిక్షతోపాటు రూ. 8 వేల జరిమానా విధించింది. బాధితురాలికి రూ. 3 లక్షల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.

భార్య సూసైడ్​కు కారణమైన వ్యక్తికి ఏడేండ్ల జైలు శిక్ష

గండిపేట: వరకట్నం కోసం భార్యను వేధించి ఆమె మృతికి కారణమైన నిందితుడికి ఏడేండ్ల కఠిన కారాగార శిక్ష పడింది. అత్తాపూర్‌‌‌‌ పరిధిలోని ఖయ్యూమ్‌‌‌‌నగర్‌‌‌‌ కు చెందిన మహ్మద్‌‌‌‌ అసద్‌‌‌‌(33) అధిక వరకట్నం కోసం తన భార్యను వేధించాడు. ఈ క్రమంలోనే ఆమె 2018లో ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో పోలీసులు పూర్తి ఆధారాలను సమర్పించడంతో ఎల్‌‌‌‌బీ నగర్‌‌‌‌ కోర్టు నిందితుడికి ఏడేండ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.3వేల జరిమానా విధించింది. నేర విచారణలో భాగమైన పబ్లిక్‌‌‌‌ ప్రాసిక్యూటర్‌‌‌‌ వి.రవికమార్, పరిశోధన అధికారి పి.అశోక్, ఏసీపీ, కోర్టు డ్యూటీ ఆఫీసర్‌‌‌‌లను ఉన్నతాధికారులు అభినందించారు.