
ఉప్పల్, వెలుగు: హైదరాబాద్ లో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. గోల్నాకకు చెందిన మహ్మద్ నబీ (30) రామంతాపూర్ వెంకటరెడ్డి నగర్ లోని టెంట్ హౌస్ లో పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం బాలకృష్ణా నగర్ మూసీ పరివాహక ప్రాంతంలో అతడిని దుండగులు బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం డెడ్‌బాడీని గాంధీ మార్చురీకి తరలించారు.