ప్రేమోన్మాదం మరోసారి పడగ విప్పింది. తన ప్రేమను నిరాకరించిందన్న కోపంతో ఓ యువతి గొంతు కోశాడో ఓ యువకుడు. ఈ ఘటన బోరబండలోని బంజారానగర్ లో జరిగింది.
కొంతకాలం నుంచి సురేష్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే.. అతడి ప్రేమను ఆమె అంగీకరించలేదు. ఇది మనసులో పెట్టుకున్న సురేష్.. యువతి గొంతు కోశాడు. ఈ ఘటనలో బాధితులరాలికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇటు యువతిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం బాధితురాలికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.