కేబీఆర్ పార్కులో మరో సినీ నటికి వేధింపులు

హైదరాబాద్ : బంజారాహిల్స్ లోని KBR పార్కులో మరో సినీ నటికి చేదు అనుభవం ఎదురైంది. కేబీఆర్ పార్కులో వాకింగ్ కు వెళ్లిన నటిని ఓ యువకుడు వెంటపడి వేధించాడు. వాకింగ్ చేస్తుండగా.. బాధితురాలి వెనకాలే వెళ్తూ వేధింపులకు గురి చేశాడు. ఇదే విషయాన్ని KBR పార్క్ సెక్యూరిటీకి చెప్పడంతో బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.