భగీరథ నీరు రావడం లేదని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు

ధర్మారం, వెలుగు: మిషన్​ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదని ఆరోపిస్తూ పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడితండా(బి) గ్రామానికి చెందిన అజ్మీర రవినాయక్‌‌‌‌‌‌‌‌  మంగళవారం ట్యాంక్​ ఎక్కి నిరసన తెలిపాడు. కొన్ని రోజులుగా వాటర్​ రావడం లేదని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితుడు ఆరోపించారు.

 అధికారులు అక్కడికి చేరుకొని నీరొచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో రవి కిందికి దిగాడు.  దీనిపై జీపీ సెక్రటరీ సుమలత మాట్లాడుతూ కరెంట్​ సమస్యల వల్ల భగీరథ నీటిని సప్లై చేయడంలో అవాంతరాలు ఏర్పడుతున్నాయన్నారు. బుధవారం నుంచి సక్రమంగా నీటిని సప్లై చేస్తామన్నారు.