చందుర్తి, వెలుగు : గల్ఫ్ వెళ్లేందుకు అప్పు పుట్టక మనస్తాపానికి గురైన యువకుడు సూసైడ్చేసుకున్నాడు. ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన గసికంటి అజయ్(22) ఊరిలో పని దొరకక గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.
అందుకు అయ్యే ఖర్చుల కోసం రెండు నెలలుగా తెలిసిన వారిని అప్పు అడుగుతున్నాడు. ఎక్కడా లభించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం ఇంట్లోని దూలానికి ఉరివేసుకున్నాడు. మృతుని తండ్రి రమేశ్ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుగుతున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. అజయ్‌కు తల్లిదండ్రులతోపాటు అక్క ఉన్నారు.