
కొండపాక, వెలుగు: ఆన్లైన్ గేమ్స్ఆడి పైసలు పోగొట్టుకొని.. చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులోని బాలాజీ కాటన్ మిల్లు సమీపంలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. సిద్దిపేట పట్టణం ప్రశాంత్ నగర్ కు చెందిన మద్దెల పవన్ కల్యాణ్ (26) జగదేవ్ పూర్లోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. కొద్ది కాలంగా డబ్బులు పెట్టి ఆన్లైన్గేమ్స్ పెడుతున్నాడు. వాటికి బానిసగా మారి అప్పులు చేసి మరీ డబ్బులు పెట్టాడు. అప్పులు తీర్చే దారి లేక మంగళవారం ఉదయం వెలికట్ట శివారులో ఓ చెట్టుకు ఉరేసుకొని చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.