బిర్యానీ తిని హాస్పిటల్ పాలైన యువకుడు.. ఇదే కారణం!

హైదరాబాద్ లో బిర్యానీ తిని ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు ఓ యువకుడు. నేరేడ్‌మెట్ గ్రీన్ బావర్చి హాటల్లో మంగళవారం రవి అనే యువకుడు చికెన్ బిర్యానీ తిన్నాడు. బిర్యానీ తిన్న తర్వాత ఫుడ్ పాయిజనింగ్ అయ్యి వాంతులు, విరేచనాలు అయ్యాయి. వెంటనే అతన్ని హాస్పిటల్లో జాయింన్ చేశారు. బిర్యానీ తిన్న తర్వాత.. ఫుడ్ పాయిజనింగ్ వల్లనే వాంతులు విరేచనాలు అయ్యాయంటూ యువకుడు ఎక్స్(ట్విటర్)లో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు కంప్లైంట్ చేశాడు. ఫుడ్ సేఫ్టీ అధికారులు నవంబర్ 19న గ్రీన్ బావర్చి రెస్టారెంట్లో తనిఖీలు చేసి.. తయారీలో సింథటిక్ ఫుడ్ కలర్స్ ను వాడుతున్నట్లు గుర్తించారు. అధికారుల వాటిని సీజ్ చేశారు. రెస్టారెంట్ లో శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు.

ALSO READ | 48 గంటల్లో.. 3 కోట్ల రూపాయలు కొట్టేశారు.. బిగ్ స్కాం ఇన్ ఇండియా