మల్యాల, వెలుగు: ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన జగిత్యాల జిల్లా యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మల్యాల మండల కేంద్రానికి చెందిన భోగ సాయి(25) తల్లిదండ్రులు చనిపోగా ఇద్దరు అక్కలకు పెండ్లిళ్లు అయ్యాయి. మూడేండ్ల కింద అతడు దుబాయ్ వెళ్లాడు. ఏడాది కింద తల్లి మృతిచెందగా సొంతూరు వచ్చాడు.
మళ్లీ నాలుగు నెలల కింద తిరిగి వెళ్లాడు. అక్కడ అల్కుస్–1ప్రాంతంలో ఉంటున్న సాయి రెండు రోజులుగా కనిపించడం లేదు. అతనితో ఉండే వారు స్థానికంగా వెతకగా తన క్యాంప్ సమీపంలో రద్దీ లేని ఏరియాలోని హోల్డింగ్ టవర్ కు సాయి ఉరేసుకుని చనిపోయి కనిపించాడు. ప్రభుత్వం స్పందించి సాయి డెడ్ బాడీని త్వరగా సొంతూరుకు రప్పించాలని బంధువులు, గ్రామస్తులు కోరుతున్నారు.