ఇబ్రహీంపట్నం, వెలుగు: బైక్‌ను టిప్పర్ ఎదురుగా ఢీ కొనడంతో ఒకరు మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొంగరకలాన్‌కు చెందిన శీలం కిరణ్ (23) ప్రైవేటు ఉద్యోగి. వ్యక్తిగత పనిపై తుక్కుగూడకు బైక్‌పై వెళ్తుండగా, అతడిని వండర్లా ఎక్స్‌రోడ్డు వద్ద టిప్పర్ లారీ ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది.
దీంతో కిరణ్ స్పాట్లోనే మృతి చెందాడు. ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఇబ్రహీంపట్నం మార్చురీకి తరలించారు.