డ్రైవింగ్​ చేస్తూ గుండెపోటుతో యువకుడి మృతి

వైరా, వెలుగు: విధులు నిర్వహిస్తూ గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మండలంలోని గరికపాడులో శుక్రవారం జరిగింది. యువకుడి కుటుంబాన్ని ఆదుకోవాలని వైరా వైష్ణవి పాల ఫ్యాక్టరీ ఎదుట మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. గరికపాడుకి చెందిన గుమ్మ ఉపేందర్(27) వైరా వైష్ణవి మిల్క్ ఫ్యాక్టరీలో వ్యాన్​డ్రైవర్ గా పని చేస్తున్నాడు. విధులు నిర్వహిస్తుండగా సూర్యాపేట వద్ద గుండెపోటు వచ్చింది. ఉపేందర్ అనారోగ్యంతో ఉన్నా డ్యూటీ చేయించారని  ఈ కారణంగానే అతడు మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యానికి నిరసన చేపట్టారు. నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైవేపై ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కల్పించుకోవడంతో పాల ఫ్యాక్టరీ యాజమన్యం మృతుడి కుటుంబానికి అండగా ఉంటామని హామీతో ఆందోళన విరమించారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు.