
నేరడిగొండ, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని వడూర్ లో అన్నదమ్ములు గొడవ పడుతుండగా ఆపడానికి వెళ్లిన ఓ యువకుడు చనిపోయాడు. పోలీసులు కథనం ప్రకారం.. శనివారం రాత్రి గ్రామానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు ఇంటి వద్ద గొడవ పడ్డాడు.
ALSO READ :మద్యం మత్తులో పొట్టు పొట్టు కొట్టుకున్నారు
అదే గ్రామానికి చెందిన కందుకూరి ప్రశాంత్ (21) వారిని సముదాయించి గొడవ ఆపే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించాడు. వారి తోపులాటలో ప్రశాంత్ కింద పడిపోవడంతో తలకు తీవ్ర గాయమైంది. ట్రీట్మెంట్కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.