
మందుబాబులు పోలీసులకు పెద్ద సమస్యగా మారాయి. ఏ క్షణం ఎక్కడ ఎలా ప్రవర్తిస్తారో పోలీసులు కూడా పసికట్టిలేని పరిస్థితి నెలకొంది. మత్తుకు బానిసగా మారిన యువత రోడ్డుపై దాడులు దిగి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా జగిత్యాల పోలీస్ స్టేషన్ ఎదుట ఓ యువకుడు ఫుల్‌గా మద్యం సేవించి.. బీర్ బాటిల్ తో నానా హంగామా సృష్టించాడు.
మద్యం మత్తులో ఏంచేస్తున్నాడో కూడా ఆయనకు తెలియలేదు. బీర్‌సీసాతో తనను గాయపరచుకొన్న శివరాం అనే యువకుడు వీరంగం సృష్టించాడు. మూడేళ్ల క్రితం జగిత్యాలకు చెందిన మంజుల అనే మహిళను రామడుగుకు చెందిన శివరాం అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే శివరాం ఓ కేసులో పోలీసులకు పట్టుబడి జైలుశిక్ష అనుభవించాడు. దీంతో అతనితో కలిసి జీవించడానికి ఇష్టపడని మంజుల పుట్టింటికి వెళ్లింది. తన భార్యను తిరిగి కాపురానికి పంపాలని జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని నిరసన తెలిపాడు. పోలీసులు అతనిని ఆటో ఎక్కించి అక్కడినుంచి పంపించివేశారు.
Also Read:-ఓయూలో జగదీశ్‌రెడ్డికి శవయాత్ర..దళిత సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్..
శివరాం తప్పు చేశాడో.. లేదో తెలియదు కాని జైలు శిక్ష మాత్రం అనుభవించాడు. సహజంగా ఇలాంటి వ్యక్తులతో కలిసి ఉండేందుకు ఏ మహిళా ఇష్టపడదు. తనను తాను మంచి వ్యక్తిగా నిరూపించుకుంటూ.. ఇరు కుటుంబాల పెద్ద మనుషులతో చర్చించి.. భార్యను కాపురానికి తీసుకెళ్లాల్సిన శివరాం.. మద్యం తాగి.. బీర్ బాటిల్ తో పోలీస్ స్టేషన్ ఎదుట వీరంగం చేయడం ఎంతవరకు సమంజసమో ఆయనకే తెలియాలి. అలాచేయకుండా మంచిగా ఏదో పని చేసుకుంటూ.. తన భార్యను మంచిగా చూసుకుంటాడనే నమ్మకం కలిగిస్తే ఎంతటి మహిళ అయినా.. భర్త చెంతకే చేరుతుందని మందుబాబులు గ్రహించాలి.